Home » Vangalapudi Anitha
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.
పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.
ఈ నియోజకవర్గంలో పోటీ చేసినవారు ఒకసారి ఓడిపోతే ఇక అంతే సంగతులు. రెండోమారు మళ్లీ గెలిచిన సందర్భాలు లేవు. గంటెల సుమన, చెంగల వెంకట్రావు, కాకర నూకరాజు పాయకరావుపేట నుంచి పలుమార్లు పోటీ చేశారు. అయితే ముగ్గురూ ఒకసారి ఓడిపోయిన తరువాత
ఎన్నికల వేళ అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత ఎన్నికల బరిలో నిలిచారు.
అమరావతి: రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా, తెనాలి వాసి గొల్తి గీతాంజలిని వైసీపీనే హత్య చేసిందని, ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
Andhrapradesh: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు - పవన్‌లు నిలబడ్డారని అన్నారు.
జగన్ ప్రభుత్వం (Jagan Govt) వైఎస్సాఆర్ చేయూత పేరుతో మహిళలను మోసం చేశారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... క్యాస్టు సర్టిఫికెట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. జగన్ అసమర్థడని సొంత చెల్లి షర్మిల చెబుతుందని అన్నారు.
Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై... మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రెస్‌మీట్‌లోనే అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు.
విశాఖ: వై నాట్ 175 నుంచి... సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని, మంత్రి రోజా అవినీతిని నగరి పార్టీ నేతలు, ప్రజలే చెబుతున్నారన్నారు.