Home » Ukraine
నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ(ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇవాళ రష్యా రాజధాని మాస్కో రీజియన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ జరిపిన అత్యంత భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ దాడికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన దారుణ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురిని హతమార్చాడు. అనంతరం ఒక సూపర్ మార్కెట్‌లోకి చొరబడి పలువురిని బందీలుగా చేసుకున్నాడు.
ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యదర్శి, జెలెన్‌స్కీ సన్నిహితుడు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.
కేవలం రోబోలు, ఇతర మానవరహిత వాహనాల సాయంతో ఒక రష్యా స్థావరాన్ని కైవసం చేసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా పేర్కొన్నారు.
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్స్‌ను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్‌ల కోసం గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.