Home » TSRTC
హైదరాబాద్: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ అనంతరం విలీనం బిల్లును ఆమోదించినట్లు తెలియవచ్చింది.
హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఆర్ఎంలు హాజరయ్యారు. ఆర్టీసీ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు.
తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలపడం, గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం బిల్లు పంపడం.. రాజ్‌భవన్ నుంచి రిప్లయ్ రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడం, విలీనం విషయంలో విధివిధానాలపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, ప్రభుత్వం నుంచి రిప్లయ్ రావడం.. ఈ మధ్యలో ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళిసై మాట్లాడటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీనంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది!. ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వివరణ పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపనున్నారు.!
తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) టీఎస్ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు రోడ్డెక్కారు. రాజ్‌భవన్‌ను కార్మికులు ముట్టడించడంపై గవర్నర్ ఆవేదనకు లోనయ్యారు..
తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది..
ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలకు రాజ్‌భవన్‌కు రావాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ ఆహ్వానం పంపారు. మరికాసేపట్లో ఆర్టీసీ ముఖ్య నాయకులతో తమిళిసై సమావేశం కానున్నారు. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చించనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు.