TSRTC Govt Merger : ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ ఏం చర్చించారు.. సాయంత్రానికల్లా శుభవార్త ఉంటుందా..!?

ABN , First Publish Date - 2023-08-05T14:09:45+05:30 IST

తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) టీఎస్ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు రోడ్డెక్కారు. రాజ్‌భవన్‌ను కార్మికులు ముట్టడించడంపై గవర్నర్ ఆవేదనకు లోనయ్యారు..

TSRTC Govt Merger : ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ ఏం చర్చించారు.. సాయంత్రానికల్లా శుభవార్త ఉంటుందా..!?

తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) టీఎస్ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు రోడ్డెక్కారు. రాజ్‌భవన్‌ను కార్మికులు ముట్టడించడంపై గవర్నర్ ఆవేదనకు లోనయ్యారు. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళిసై ఆర్టీసీ కార్మిక సంఘం నేతలను చర్చలకు పిలిపించారు. ప్రస్తుతం గవర్నర్ పుదుచ్చేరిలో ఉండటంతో కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో (Video Conference) మాట్లాడారు. అంతకుముందు 5 ప్రశ్నలతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు వస్తే సాయంత్రానికే బిల్లుపై సంతకం పెడతానన్నారు. అయితే.. ప్రభుత్వం నుంచి వివరణ వెళ్లింది కానీ.. ఇంతవరకూ రాజ్‌భవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాగా.. అరగంటపైగా ఆర్టీసీ కార్మికులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.


1tamilisai.jpg

ఏం మాట్లాడారు..?

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తెలంగాణ మజ్దూర్ సంఘ్ కార్మిక నాయకుడు థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ముసాయిదాపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. గతంలో ఆర్టీసీ కార్మికులకు సహాయం చేశానని ఇప్పుడు కూడా అదే చేస్తానన్నారు. గవర్నర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం రాగానే ముసాయిదాను సాయంత్రం వరకు అసెంబ్లీకి పంపేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఆమోదించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసమే, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తానని గవర్నర్ చెప్పారు. బిల్లును ఆమోదించాలని కోరాము. రాజ్ భవన్- ప్రభుత్వం ఆలస్యం వల్ల మాకు ఇబ్బంది అవుతోంది. ఎలాంటి అనుమానాలు ఉన్నా.. అసెంబ్లీకి బిల్లును పంపాలని కోరాము. ఏదైనా ఉంటే అసెంబ్లీలో మేము మాట్లాడుకుంటామని గవర్నర్‌తో చెప్పాము. బిల్లు ఇవ్వాలే.. ఆమోదం అవుతుందని ఆశిస్తున్నాం. మేమే ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేశాం. రాజ్ భవన్ వద్దకు మేం తెస్తేనే కార్మికులు వచ్చారు. ముఖ్యమంత్రిని మెప్పించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంకు ఒప్పించాము. అశ్వత్థమ రెడ్డి కార్మిక ద్రోహి.. కార్మిక మరణాలకు కారకుడు ఆస్వార్ధమ రెడ్డిఅని థామస్ రెడ్డి మీడియాకు వివరించారు. మొత్తానికి చూస్తే గవర్నర్ నుంచి ఇవాళ సాయంత్రానికల్లా శుభవార్త వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఈ నిరసనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. కార్మికులే చేపట్టారని థామస్ తెలిపారు.

Workers-Protest.jpg


ఇవి కూడా చదవండి


TSRTC Govt Merger : గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ.. ఇక మిగిలిందల్లా ఒక్కటే..!?


Raj Bhavan Vs Bus Bhavan : ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు.. రాజ్‌భవన్ కోరిందేంటి..!?


TSRTC Merger bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ కోరిన ఐదు అంశాలు ఇవే...


TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..!



Updated Date - 2023-08-05T14:12:37+05:30 IST