TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం?

ABN , First Publish Date - 2023-08-06T14:04:51+05:30 IST

హైదరాబాద్: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ అనంతరం విలీనం బిల్లును ఆమోదించినట్లు తెలియవచ్చింది.

TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం?

హైదరాబాద్: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీఎస్ ఆర్టీసీ (TSRTC) విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై (Gover Tamilisai) ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో (RTC Officers) గవర్నర్ భేటీ అనంతరం విలీనం బిల్లును ఆమోదించినట్లు తెలియవచ్చింది. ఆర్టీసీ అధికారులతో గవర్నర్ రాజ్‌భవన్‌లో సమావేశమై 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. అధికారులు ఇచ్చిన వివరాలతో ఆమె సంతృప్తి చెందినట్లు సమాచారం. ఆర్టీసీ బిల్లుపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్ (Munishekhar), ఆర్ఎం (RM)లు హాజరయ్యారు. ఆర్టీసీ అధికారులతో సమావేశం ముగించిన గవర్నర్ పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం వరకు అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) కొనసాగనున్న నేపథ్యంలో ఆర్టీసీ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

ఆర్టీసీ విలీనం బిల్లుపై కొన్ని విషయాలపై గవర్నర్ అధికారుల నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఆర్టీసీ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. విలీనం పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ (PRC), డిఏ (DA), సీపీఎస్ (CPS) బకాయిల వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఇచ్చిన వివరాలతో గవర్నర్ తమిళిసై సంతృప్తి చెంది.. బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే గవర్నర్ ఆమోదం తెలిపినట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Updated Date - 2023-08-06T14:29:48+05:30 IST