Home » Thummala Nageswara Rao
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఆర్థిక అనుమతులను మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ.. పెద్దాయనకు కోపం రాదంటే.. ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గరి ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి.
రాష్ట్ర రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే నూతన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం నాడు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు అభివద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భానుడు నిప్పులు కక్కుతుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు.
రైతులకు రుణమాఫీ చేసినట్లుగానే, నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత వర్గాల సమస్యలపై క్యాబినెట్‌లో చర్చించి, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంతోపాటు పంటలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాటిని వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జార్ఖండ్ వ్యవసాయ మంత్రి శిల్పి నేహ భేటీ అయ్యారు. రైతుల సంక్షేమ పథకాలపై చర్చించిన ఈ సమావేశంలో ఆయిల్‌పామ్, కృత్రిమ మేధస్సు వినియోగం, హార్టికల్చర్ రంగ అభివృద్ధి పై చర్యలు తీసుకోవడం అన్నింటిపై సమీక్షించారు