Tummala: అర్బన్ పార్కుల అభివృద్ధి
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:13 AM
రాష్ట్రంలోని పట్టణప్రాంతాల్లో ఉన్న అటవీ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, జనవరి 17(ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్రంలోని పట్టణప్రాంతాల్లో ఉన్న అటవీ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోతున్నందున ప్రకృతిని కాపాడుకునేందుకు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న అటవీపార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం పట్టణ సమీపంలోని వెలుగుమట్ల అర్బన్ అటవీ పార్కును శుక్రవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల, కొత్తగూడెం, సత్తుపల్లి అటవీ పార్కుల అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు చేసిందన్నారు వెలుగుమట్ల అటవీపార్కులో రోజుకు 10వేలమంది పర్యాటకులు, సందర్శకులు వచ్చేలా అభివృద్ధి చేయాలని, సహజసిద్ధమైన వివిధ రకాల మొక్కలు, నాటాలని సూచించారు.