Home » Thummala Nageswara Rao
యాసంగి సీజన్‌లో ఎకరం పంట కూడా ఎండటానికి వీలు లేదని, ఇరిగేషన్, వ్యవసాయాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ అనుచరుడి పాడె మోశారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు, సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు గాదె సత్యనారాయణ శుక్రవారం మృతి చెందగా శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వంచారు.
ఆయిల్‌పామ్ గెలల ధర ఆశించిన దాని కన్నా ఎక్కువ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయిల్‌పామ్ ఓఈఆర్(ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు) తగ్గకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడం,
రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చే విషయంలో బ్యాంకర్లు తీరు మార్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న స్థాయిలో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వ్యవసాయ రంగానికి మంచిదికాదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కృష్ణాజలాల పంపకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సత్వర పరిష్కారం చూపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఎరువులను తెప్పించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
రాష్ట్రంలో రైతుల అవసరానికి తగిన విధంగానే ఎరువుల సరఫరా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేఽశ్వరరావు అన్నారు. శుక్రవారం సచివాలయంలో యాసంగి సీజన్ ఎరువుల లభ్యత, సరఫరాపై శాఖ డైరక్టర్ బి.గోపితో చర్చించారు.
రాష్ట్రం లో మరో రెండు, మూడు చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అగ్రో కెమికల్స్ అసోసియేషన్, న్యూఢిల్లీ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.