Home » Thanneeru Harish Rao
రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్‌ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్‌రావు అన్నారు.
తెలంగాణకు నీటి విషయంలో అన్నిరకాలుగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు పక్కకు పెట్టడానికి కారణం హరీష్‌రావునే అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.
గోదావరి, కృష్ణా నీళ్లను ఏపీ వాడుకోమని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి దాసోహం అయ్యారని విమర్శించారు. నల్లమల ఏ జిల్లాల్లో ఉందో కూడా రేవంత్‌రెడ్డికి తెలియదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్లడం అంటే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు అన్నట్లేనని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ స్పష్టత లేదని హరీష్‌రావు చెప్పారు.
బీఆర్ఎస్‌పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని హరీష్‌రావు తెలిపారు.
రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమీక్ష చేశామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వ్యాధుల వల్ల కోడెలు చనిపోవడం బాధాకరమని తెలిపారు. కొందరు భక్తులు పాలు కూడా మరువని కోడెలను తీసుకొస్తున్నారని చెప్పారు.
బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్ ను ఆపాలని హరీష్‌రావు సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రైతుబంధు వేస్తామన్నారని.. ఇప్పటికీ ఇంకా రైతులందరికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని మాజీమంత్రి హరీష్‌రావు నిలదీశారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని హరీష్‌రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని మాజీమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని అన్నోళ్లకి పండిన పంట తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు పారుతున్నాయని తెలిపారు.
భారతదేశం అంతర్ యుద్ధం లేకుండా ఉంది అంటే అంబేద్కర్ ముందు చూపు వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బడుగు, బలహీనవర్గాల్లోని ప్రజలకు అంబేద్కర్ తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దారి చూపించారని హరీష్‌రావు చెప్పారు.