Home » TGSRTC
హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
ఆర్టీసీ జేఏసీ బంద్ ప్రకటనతో గ్రేటర్‌లోని బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కీలక మలుపు తిరిగింది. టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని తెలిపారు.
కాలయాపన చేయకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. అందుకోసం తమ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు.
ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులకే రంగులు వేసి.. సీట్లు మార్చి డీలక్స్‌లుగా ఆర్టీసీ తయారు చేస్తోంది. కొత్త బస్సులను మాత్రం తీసుకురావడం లేదు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేసినట్లు తెలిపారు. మిగతా అంశాలు క్లియర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరికలతో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేయడంతో పరిస్థితి కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.