Home » TG News
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నడుపుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల రూటు మార్చడం వివాదాస్పదంగా మారింది.
అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో తాను 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని.. కుటుంబం కోసం వ్యాపారం చేయడం తప్పా..? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి పద్మశాలీ నేతకే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆ సామాజిక వర్గం నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీటు దక్కించుకునేందుకు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
‘‘ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ (ఈసీ) వైఖరి మార్చుకోవాలి. లేదంటే హైదరాబాద్‌లో మాత్రం మాములగా ఉండదు. ఎన్నికల కమిషన్ గానీ, హైదరాబాద్ గానీ తగలబడిపోతయ్’’ అని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ ఆలస్యం కావడం, నిధుల విడుదలలో జాప్యం నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులకు ఎదురవుతున్న అడ్డంకులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పోలీస్ జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను పునర్విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్యతో కలిసి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి ఆయన నగరానికి విచ్చేశారు.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా నారపల్లిలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జాదవ్ సాయి తేజ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. విద్యార్థి మృతి ఘటనపై నివేదిక పంపకపోవడాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.