Home » TG Govt
42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సింఘ్వీ , దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న(ఆదివారం) రాత్రే ఢిల్లీ చేరుకున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యే పోటీకి ఎలా అర్హులు అవుతాడని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. 'నవీన్ యాదవ్‌కు ఓటర్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు, GHMC కమిషనర్ ఇచ్చారా..? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా..?' ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ప్రకటించింది.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి చేసేందుకు ఓ లాయర్ యత్నించాడు. కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు.
అటవీ శాఖకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి, అలాగే అటవీ శాఖ రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూమిపై వివరాలను రెండు శాఖలు కలిసి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించింది.
ఆదివారం ఉదయం నుంచి దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది.
దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. దీంతో రహదారులు కార్లు, బస్సులు, ఇతర వాహనాలతో రద్దీగా మారిపోయాయి.
తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రాంచందర్ రావు కోరారు. వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వెయ్యలేదని ఆరోపించారు.