Home » TG Govt
హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్‌లో కీలకమైన జీవోనెం.9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి హైకోర్టులో నిన్నటి నుంచి కొనసాగుతన్న వాదనలు ఇవాళ్టీతో ముగిసాయి.
బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో నేడు వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించి షాక్ ఇచ్చింది.
దేశంలో మెడికల్ టూరిజం పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్లు, మందులు తయారీలో భారత్ టాప్‌లో ఉందని ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటు డయాబెటిస్ సమస్య కూడా దేశంలో పెరిగిందని చెప్పుకొచ్చారు.
ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ప్రతినిధి బృందం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని 'సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన సూచించారు
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తుందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ని స్వయంగా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆర్టీసీపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.
ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది.