Home » Tesla
భారత్‌లో టెస్లా కార్ల విక్రయాలు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముంబై, ఢిల్లీలో షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఏర్పాట్లు ప్రారంభించిందని సమాచారం. రూ.22 లక్షల లోపు విద్యుత్ కార్లను భారత్‌లో విక్రయించేందుకు సంస్థ నిర్ణయించింది.
భారత ఈవీ మార్కెట్‌లో ప్రవేశించాలనుకుంటున్న టెస్లా ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి కార్యకలాపాల కోసం ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉద్యోగ నియామకాలకు తెర తీసింది.
Elon Musk Son Controls Trump : కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, నోరు జారడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నైజం. ఎప్పుడేం మాట్లాడినా రచ్చ క్రియేట్ కావడం సర్వసాధారణం. తగ్గేదేలే అంటూ ఎదిరించినవారిని మరించ రెచ్చగొడతాడు. అలాంటి ట్రంప్‌ను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడు X నోరెత్తకుండా చేశాడు. అదీ మీడియా ముందు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు..
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) క్రేజీ ప్రాజెక్ట్ న్యూరాలింక్(Neuralink). ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూరాలింగ్ సంబంధించి ఎలాన్ మస్క్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు.
ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తోంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను కర్కశంగా తొలగించింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.
కపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.