Home » terror attack
Pahalgam Attack Supreme Court: పర్యాటకులే లక్ష్యంగా పహల్గామ్‌లో జరిగిన టెర్రిరిస్టుల అటాక్‌పై సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. పహల్‌గావ్ దాడిలో భద్రతా ఏర్పాట్లేమీ లేవని తేలిందని న్యాయవాది విశాల్ తివారీ తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లోయ సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందిన ఈ ప్రాంతం. కానీ ఇప్పుడు పహల్గామ్‌లో హింసాత్మక ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు, ఎక్కడ జరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
CM Chandrababu: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడులను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ దాడిలో విశాఖపట్నం జిల్లా వాసి చంద్రమౌలి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కాశ్మీర్‌లో జరిగిన పహెల్‌గామ్ ఉగ్రదాడిని చైనా మినహా 20 దేశాలు ఖండించాయి. ఖండించిన దేశాలు.. యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇటలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, సైప్రస్, సౌదీ అరేబియా, జపాన్, ఇరాన్, సింగపూర్, అర్జెంటీనా శ్రీలంక, ఫ్రాన్స్, ఉక్రెయిన్, ఎస్టోనియా, డెన్మార్క్, మోల్డోవా, లిథువేనియా, జర్మనీ, గయానా..
Union Minister Rammohan Naidu: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక విమానాలు నడిపించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు తనకు సమాచారం అందించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
పహల్గామ్ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది. ఈ క్రమంలో మానవత్వం కదిలించేలా చేసిన పలువురి విషాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pawan Kalyan: జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహెల్‌గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విశాఖకు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి మృతి చెందారు.
పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ చేరుకున్నారు. కానీ ఉగ్రదాడి తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు ఢిల్లీకి తిరిగి వచ్చారు.