Home » Telangana High Court
గతేడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు 10,27,335 ఉండగా, ఈ-చలాన్లు 25,93,152 ఉన్నాయి.
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించింది..
డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం యూపీఎస్‌సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య పెంచి సరిహద్దులు మార్చుతున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నేటితో (డిసెంబర్ 17)తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులెవరినీ గుర్తించలేదా అంటూ సీజే సీరియస్ అయ్యారు.
గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అయినట్లు సమాచారం.