Home » Supreme Court
రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటింటాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్‌ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
వక్ఫ్ చట్ట సవరణ 2025పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఈ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించింది.
శాసనసభ బిల్లులకు గవర్నర్ల ఆమోదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లో కల్లోల పరిస్థితుల గురించి ప్రస్తావించిన ఆయన తనకు భారత రాజ్యాంగం గర్వకారణమని అన్నారు.
ఆధార్‌ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే. ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై టీబీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను ఇవాళ కొట్టివేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు తప్పని సరిగా ఉండాలని 2020లోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నైట్ విజన్, ఆడియో రికార్డింగ్ ఉన్న సీసీటీవీ కెమెరాలను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.
ST జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ రావు విమర్శించారు. లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు లైన్ క్లియరైంది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుంచి 12వ తరగతి వరకు.. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో-33ని సుప్రీంకోర్టు సమర్థించింది.