Home » Summer
ఎండలు అదిరిపోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్ వాతావరణానికి, ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఉక్కబోత నిత్యకృత్యమైంది.
అనంతపురం జిల్లాలోని బోరుబావుల్లో వర్షాకాలంలో నీరు రావడమే కష్టం. అలాంటిది వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
దాదాపు 10 రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. మరోవైపు వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నుంచి 23వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పుల తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించారు.
రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్‌పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.
వేసవిలో అందరికి అందుబాటులో ఉండేవి మామిడిపండ్లు. నోరూరించే మామిడి పండ్ల మెరుపు చూడగానే కొనాలనిపిస్తుంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
మామిడి పండ్లు మార్కెట్‌లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.
హైదరాబాద్ నగరం ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్ పరిధిలో వాటర్ ట్యాంక్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.