Home » Special trains
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ హుషారే వేరు.! ఈ వేడుక కోసం ఊర్లకు వెళ్లేందుకు పలువురు ప్రణాళికలు సిద్ధం చేస్కుంటుంటారు. ఇక ప్రయాణ విషయానికొస్తే రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి.. రెండు నెలల ముందే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకూ వెయిటింగ్ చూపిస్తుండటంతో.. సంక్రాంతి వేళ రద్దీ ఏమేర ఉండనుందో ఊహకందదేమో..!
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.
శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించే భక్తులకు గుడ్‌న్యూస్. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే 60 పైగా ప్రత్యేక రైళ్లు నడుపబోతోంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు..
దీపావళి సందర్భంగా న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ జంక్షన్‌తో సహా పలు ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నార్తరన్ రైల్వే అదనపు టిక్కెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా పెంచింది.
దీపావళి, చాట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
ముజఫర్‌పూర్-హైదరాబాద్ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఆయుధపూజ, దీపావళిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06151 చెన్నై సెంట్రల్-కన్నియాకుమారి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 22,29, అక్టోబరు 6,13,20 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11.50కు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.
ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్ ఫాస్ట్ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్-మహబూబ్‌నగర్-గోమ్టినగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.