Home » Siddaramaiah
బ్రాండ్ బెంగళూరుని బాంబు బెంగళూరుగా మార్చారని, రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Blast) కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency - NIA)కు అప్పగించాలని బీజేపీ (BJP) చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తీవ్రంగా స్పందించారు.
బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లపై (Rameshwaram Cafe Bomb Blast) బీజేపీ (BJP) చేసిన విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలుళ్లు (Bomb Blasts) జరిగాయని, అప్పుడు వాళ్లు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? అని సీఎం ప్రశ్నించారు.
బెంగళూరు రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భారీ పేలుడు సంభవించి, 10 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేఫ్ యజమానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారు ఈ ఘటనపై ఎలా స్పందించారో ఇక్కడ చుద్దాం.
కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్‌లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందన్నారు.
కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ ఆరోపణలు నిజమని తేలితే ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని ముగ్గురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
బెంగళూరు నగరాన్ని పీడిస్తున్న శాంతిభద్రతల సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బెంగళూరు నగరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
‘గ్యారంటీ స్కీమ్స్’ కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. హమీ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ కాలేదని తాను నిరూపించగలనని అన్నారు. ఈ విషయంపై తాను చర్చించడానికి సిద్ధమని.. అమిత్ షా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ కేసులో మార్చి 6న ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.2022లో కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగి రోడ్లు దిగ్బంధం చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు చెప్పింది.ఖో