Home » Security
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలోని11 జోన్లలో 11 మంది డీసీపీలు, 8000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) చట్టం 2023 అమల్లోకి వచ్చింది. సీఎం జగన్ భద్రతా వ్యవహారాలను సెక్యూరిటీ వింగ్ చూస్తుంటుంది. ఇకపై ఎస్ఎస్‌జీ సిబ్బంది కూడా భద్రతా చర్యల్లో పాల్గొంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ప్రకటించింది.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్య ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్‌సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
అయోధ్యలోని రామాలయం చుట్టూ భద్రతను సాయుధ బలగాలు మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. ఉగ్రదాడి ముప్పు ఉండవచ్చనే సమాచారంతో సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ నిరోధానికి, సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి, ఆయన సమీప కుటుంబసభ్యులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ సమూహం (ఎ్‌సఎ్‌సజీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....
అక్రమ చొరబాటులకు కళ్లెం వేసేందుకు రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి ప్రయాణాలపై నిషేధం విధించారు.
తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.