Home » Sankranthi festival
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను సొంతూళ్లకు వెళ్ళి జరుపుకునేందుకు సుమారు 1.32 లక్షలమంది రాష్ట్రరవాణా సంస్థ ప్రత్యేక బస్సుల్లో టికెట్లు రిజర్వుచేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సులు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని రవాణా శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు.
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
పొంగల్ పండుగను అడ్డుపెట్టుకుని ప్రైవేటు బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నై - తిరునెల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ఏకంగా రూ.4 వేలు చార్జీ వసూలు చేయడం గమనార్హం.
సంక్రాంతి(Sankranti) సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే తిరుపతి- హైదరాబాదు(Tirupati- Hyderabad) మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ళును నడుపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్(Railway CPRO Sridhar) తెలిపారు.
సంక్రాంతి పండగ(Sankranti festival) వచ్చిందంటే దేశంలోని అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కళ్లన్నీ హైదరాబాద్(Hyderabad) మహానగరంపైనే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ తెలిపింది.
కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ముత్యాల ముగ్గులతో పుడమి పులకించింది. రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది! ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు..
రాష్ట్రంలో సంప్రదాయ, సాహస జల్లికట్టు(Jallikattu) పోటీలను శనివారం పుదుకోట జిల్లా తచ్చంకుర్చిలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్.రఘుపతి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వి.మెయ్యనాథన్ జెండా ఊపి ప్రారంభించారు.