Home » Sajjala Ramakrishna Reddy
ఇడుపుల పాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) బస్ యాత్ర ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. ఈ నెల 27వ తేదీన ఇడుపుల పాయ నుంచి జగన్ బస్ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడమే జగన్ లక్ష్యమన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్దం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించామన్నారు. సీఎం జగన్ 20 ఏళ్ల పాటు జరగని అభివృద్దిని చేశారన్నారు. మ్యానిఫెస్టోలో 99శాతం హమీలు నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.
పీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యాచ్‌తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు.
టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను నమోదు చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయంపై తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) ఎక్స్(ట్విట్టర్) వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘
Telangana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు విమర్శలు గుప్పించారు. జగన్ పిరికి పంద అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన జగన్ ముగినిపోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీ(YSRCP) ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు, చేర్పులు చేసింది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ తమతమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తామని చెప్పినట్టుగానే.. అభ్యర్థులను మార్చేస్తున్నారు.