Home » Russia
ప్రెసిడెంట్ (పుతిన్) ఎయిర్ రూట్‌పై ప్రయోగించిన ఉక్రెయిన్ డ్రోన్‌ను అక్కడికి చేరకముందే మార్గమధ్యంలోని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుకుని కుప్పకూల్చినట్టు అధికారులు చెప్పారు. ప్రెసిడెంట్ కాన్వాయ్‌ను గాల్లో ఉండగానే ఢీకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాటి యత్నంగా దీనిని రక్షణ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రష్యా మీడియా తెలిపింది.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.
రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ (Trump Putin Call) ద్వారా సంభాషించినట్లు చెప్పారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Russian Dream Teacher: కొన్ని సార్లు అతడి ఫోన్‌కు తన పర్సనల్ ఫొటోలు పంపేది. బాలుడ్ని కూడా ఫొటోలు పంపమని అడిగేది. ఇద్దరి మధ్యా అసభ్యకరమైన చాటింగ్ నడిచింది. ఓ రోజు ఈ మెసెజ్లు, ఫొటోలను బాలుడి తల్లి చూసి షాక్ అయింది.
సమస్యల పరిష్కారానికి భారత్,పాకిస్థాన్‌లు చర్చలు జరుపుకోవాలని రష్యా సూచించింది. ఇప్పటికే అమెరికా, చైనాలు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా తాజాగా ఆ జాబితాలో రష్యా చేరింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. తాజాగా ఒకేరోజు భారత్-పాకిస్తాన్, ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందాలను కుదిర్చి ప్రపంచ శాంతి సాధనలో కీలక పాత్ర పోషించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియాతో ఉద్రిక్తత వేళ పాకిస్థాన్ ఇటీవల ఐఎంఎఫ్ నుంచి రుణం పొందింది. అయితే ఈ రుణాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదానికి లేదా S-400 వంటి ఆయుధాల కొనుగోలు కోసం ఉపయోగించవచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది సాధ్యం అవుతుందా, నిపుణులు ఏమంటున్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్టైతేనే రష్యాతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించాలని పుతిన్‌ను కోరారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దశగా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధక్ష్యుడు వ్లాదిమిర్ పుతీన్ కూడా ప్రకటించారు.