Roman Starovoit: పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తుపాకీతో కాల్చుకొని రష్యా మంత్రి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:05 AM
పదవి నుంచి తొలగించిన కొద్ది గంటల వ్యవధిలోనే రష్యా రవాణా శాఖ మంత్రి రోమన్ స్టారోవోయిత్ సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
మాస్కో, జూలై 7: పదవి నుంచి తొలగించిన కొద్ది గంటల వ్యవధిలోనే రష్యా రవాణా శాఖ మంత్రి రోమన్ స్టారోవోయిత్ సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మాస్కో శివారులో తన సొంత కారులోనే ఆయన ప్రాణాలు తీసుకున్నారు. కొంతకాలంగా ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్న అధ్యక్షుడు పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.
పదవి నుంచి తొలగిస్తూ పుతిన్ ఇచ్చిన ఆదేశాలను రష్యా లీగల్ ఇన్‌ఫర్మేషన్ పోర్టల్‌లో పెట్టినా ఇందుకుగల కారణాలను వివరించలేదు. ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న కుర్ష్క్ రీజియన్‌కు అయిదేళ్లపాటు గవర్నర్‌గా పనిచేసిన స్టారోవోయిత్‌ను గత ఏడాది మే నెలలో రవాణా శాఖ మంత్రిగా పుతిన్ నియమించారు.