Home » Rave party Bangalore
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీగలాగితే డొంక కదులతోంది. రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తుండగా.. పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్టుతో ఊహించని ఫలితాలు వచ్చాయి.
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు బెజవాడలోనే ఉన్నాయా..? వన్‌టౌన్‌లోని ఆంజనేయ వాగుకు చెందిన వాసు ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగిందా..? ఒకప్పుడు పూరింట్లో కఠిక పేదరికం అనుభవించిన వాసు ఇప్పుడు రూ.కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు..? వాసు డాన్‌గా జిల్లాలో బెట్టింగ్ బుకీల వ్యవస్థ నడుస్తోందా..? అన్నీ తెలిసి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారా..? వీటన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది..
అమరావతి: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు.
నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించిన సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. మంగళవారం ఇదే విషయమై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ.. సన్ సెట్ టు సన్‌రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని వెల్లడించారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని.. ఈ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని సీపీ తెలిపారు.
నెల్లూరు: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు.