Home » Raptadu
రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ పేరుమీదుగా గుర్తుతెలియని వ్యక్తి నకిలీ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించినట్టు తెలిసిందని రామగిరి పోలీసులు బుధవారం ప్రకటనలో తెలిపారు.
మండలపరిషత అధ్యక్షురాలు హేమలతపై వైసీపీ ఎంపీటీసీ సభ్యుల అసమ్మతి తారాస్థాయికి చేరింది. దీంతో మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రెండో రోజు నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశానికి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరుకాలేదు.
మండలంలోని ఆలమూరు చెరువు రెండురోజుల కిందట మరువ పారింది. దీంతో ఆ చెరువును ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం సాయంత్రం పరిశీలించారు.
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.
హైటెక్ సిటీతో నాడు హైదరాబాద్... గూగుల్‌తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్ స్కూల్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.