ROB ఆర్వోబీపై వాహనాల రాకపోకలను20 రోజుల్లో ప్రారంభిస్తాం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:49 AM
మండలకేంద్రంలోని ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై మరో 20 రోజుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడించారు. ఆ బ్రిడ్జి పనులను ఆమె నేషనల్‌హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
రాప్తాడు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై మరో 20 రోజుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడించారు. ఆ బ్రిడ్జి పనులను ఆమె నేషనల్‌హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
పనులు ఎంతవరకు వచ్చాయి. బ్రిడ్జిని ఎప్పటిలోగా ప్రారంభిస్తారని అధికారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి మంజూరైందన్నారు. దీనికి రూ.74 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు. పాత కాంట్రాక్టర్ రూ. 49 కోట్ల వరకూ పనులు చేశారన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి నిర్మాణ పనులను పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి తిరిగి పనులు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2026 మే నెలలోగా పనులు మొత్తంగా పూర్తవుతాయన్నారు. మరో 20 రోజుల్లో ఆర్వోబీపై వాహనాల రాకపోకలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీడీపీ మండల ఇనచార్జి ధర్మవరపు మురళి, కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కురుబ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గంగలకుంట రమణ, మరూరు సొసైటీ చైర్మన గోపాల్, మార్కెట్ యార్డు వైస్‌చైర్మన కిష్టా, నాయకుడు నారాయణస్వామి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..