MPP ఎంపీపీ హేమలతపై తీవ్ర అసమ్మతి
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:02 AM
మండలపరిషత అధ్యక్షురాలు హేమలతపై వైసీపీ ఎంపీటీసీ సభ్యుల అసమ్మతి తారాస్థాయికి చేరింది. దీంతో మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రెండో రోజు నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశానికి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరుకాలేదు.
ఆత్మకూరు అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలపరిషత అధ్యక్షురాలు హేమలతపై వైసీపీ ఎంపీటీసీ సభ్యుల అసమ్మతి తారాస్థాయికి చేరింది. దీంతో మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రెండో రోజు నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశానికి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరుకాలేదు.
దీంతో ఎంపీడీఓ లక్ష్మీనరసింహ సమావేశాన్ని నిరవధికంగా మళ్లీ వాయిదా వేశారు. సమావేశానికి కనీసం కోరం సభ్యులు కూడా హాజరు కాలేదు. మండలంలో 11ఎంపీటీసీ స్థానాల్లో ముట్టాల ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి పారిజాతమ్మ గెలుపొందారు. మిగిలిన పది స్థానాల్లో టీడీపీ ఎన్నిక బహిష్కరించడంతో పోటీజరగలేదు. పోటీలేకుండా ఎన్నికయిన వైసీపీ సభ్యులకు మొదటి నుంచి ఎంపీపీ కనీస గౌరవం ఇవ్వలేదని, దీంతో అప్పటి నుంచే అసమ్మతి ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ ఆవేదనతోనే సభ్యులు మొహం చాటేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..