• Home » Ramoji Rao

Ramoji Rao

Ramoji Rao: రామోజీ మృతి పట్ల కేసీఆర్, హరీశ్, కేటీఆర్ సంతాపం

Ramoji Rao: రామోజీ మృతి పట్ల కేసీఆర్, హరీశ్, కేటీఆర్ సంతాపం

ప్రముఖ మీడియా నిపుణులు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు(87)(Ramoji rao) మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటు రామోజీ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

CM Ramesh: రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు

CM Ramesh: రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు

రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియా, సినీ, టీవీ రంగాల్లో దిగ్గజంగా వెలిగిన రామోజీరావు మరణం బాధాకరమన్నారు. వ్యాపారాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయపథంలో నడిపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న మహా మేధావి అని సీఎం రమేష్ కొనియాడారు.

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Ramoji Rao: రామోజీరావు మృతి ఆవేదన కలిగించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు మృతి ఆవేదన కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అడుగు పెట్టిన ప్రతీ రంగంలోనూ ఆయన తన మార్క్‌ను చూపించారన్నారు.

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు(Ramoji Rao) మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు.

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు

రామోజీ రావు(Ramoji Rao) మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు 'రూపర్ట్ మర్డోక్'గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు(87) వ్యాపారవేత్తగా, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ramoji Rao: భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన రామోజీ రావు

Ramoji Rao: భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన రామోజీ రావు

: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు.

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి

చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం. 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్న మహోన్నత వ్యక్తి.

Ramoji Rao: మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీ అస్తమయంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Ramoji Rao: మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీ అస్తమయంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ వరకు

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ వరకు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి