Home » Rajya Sabha
పెద్దల సభలో బిలియనీర్లు 12 శాతం మంది ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలే అగ్రస్థానంలో ఉన్నారు. 233 స్థానాలున్న రాజ్యసభలో 225 ఎంపీలుండగా, రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది పార్లమెంటేరియన్లలో ఐదుగురు (45 శాతం), తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తన ప్రాణ స్నేహితుడు.. ఎంపీ కేశరావును (MP Kesavarao) పక్కనెట్టేస్తున్నారా..? మరోసారి ఆయన్ను ఢిల్లీ పంపే ఆలోచన గులాబీ బాస్ లేదా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. దీనికి చాలానే కారణాలున్నాయని బీఆర్ఎస్ (BRS) వర్గాలు చెబుతున్నాయి..
ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించేంత వరకూ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ శుక్రవారంనాడు ప్రకటించారు.
గత 8 ఏళ్లలో 2.4 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ (Surrendered passports) చేశారని తాజాగా వెలువడిన ప్రభుత్వ డేటా చెబుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్‌చైర్‌పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు (Delhi Ordinance Bill) లోక్‌సభ (Loksabha), రాజ్యసభలో (Rajyasabha) ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్డినెన్స్ బిల్లు చట్టం కానుంది. త్వరలోనే ఈ బిల్లును రాష్ట్రపతికి కేంద్రం పంపనుంది. ఇంతవరకూ అంతా ఓకేగానీ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయి..?
ఢిల్లీ సర్వీసుల బిల్లుకి రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లుకి వ్యతిరేకంగా 102 ఓట్లు రాగా.. అనుకూలంగా 131 ఓట్లు నమోదు అయ్యాయి. రాజ్యసభలో మొత్తం 237 మంది సభ్యులు ఉండగా.. బిల్లు పాస్ అవ్వడానికి 119 మంది ఓట్లు అవసరం ఉంటుంది.
ఢిల్లీలో ఎలాంటి అవినీతికి తావులేని పాలన అందివ్వడం, అవినీతిపై పోరాటమే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చ కు అమిత్‌షా సమాధానమిస్తూ, తాము సుప్రీంకోర్టు ఉల్లంఘనకు పాల్పడలేదన్నారు.
ఢిల్లీ సర్వీసుల బిల్లును ఏం చేసైనా సరే సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రాథమికంగా ప్రజావ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఢిల్లీ సీనియర్ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించే ఆర్డినెన్స్ స్థానే ఢిల్లీ సర్వీసుల బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు