Home » Raja Singh
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిధులను బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదు?.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల రెండో విడుత పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగిందని.. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఏదేదో మాట్లాడారని అన్నారు.
బీఆర్ఎస్(BRS), ఎంఐఎం (MIM) కలిసి బోగస్ ఓట్లు(Bogus votes) సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)అన్నారు.
ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly session) మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్ (Raja Singh) ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదా..? గోషామహల్ (Goshamahal) నుంచి మాజీ మంత్రి కుమారుడు, యువనేతకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇవ్వాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఫిక్స్ అయ్యిందా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..
రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్‌కు (DGP Anjani Kumar) లేఖ రాశారు.