Home » Priyanka Gandhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి ఆ పార్టీ నాయకత్వం రాయ్ బరేలీ టికెట్ ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు.
Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకు అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా, సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
లోక్‌సభ ఎన్నికల వేళ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేకుండా దేశంగా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు రావని అన్నారు.
రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం నాడు మాట్లాడారు. అర్థం, పర్థం లేని వ్యాఖ్యలపై మాట్లాడాలని అనుకోవడం లేదు. తమ గురించి కంగన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు.