Home » Politics
కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ మీటింగ్ ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సి ఉంది. తాజాగా ఆయన మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నాయి.
గవర్నమెంట్ యూనివర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని సంబంధిత అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణతా శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈరోజు నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరుగనుంది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ Vs వివేకానంద గౌడ్ కేసు విచారణ జరుగనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది.
బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి.. ఆటంబాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు రాబోతోంది.
బిహార్ శాసనసభ ఎన్నికల్లో గురువారం మొదటి దశ పోలింగ్ జరుగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది.
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వేరే దిక్కు లేక రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని చెప్పారు.
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో పోస్టుమార్టం ఒకే చోట నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.