Indira Bus Service: మూడు ఇందిరా బస్ సర్వీస్‌లను ప్రారంభించిన మంత్రి భరత్
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:16 PM
కర్నూలు నుంచి విశాఖపట్నంకు మూడు ఇందిరా బస్ సర్వీస్‌లను శనివారం మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. గతంలో వైజాగ్ కు సూపర్ లగ్జరీ సర్వీస్ ఉండేదిని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టూరిజం డెవలప్‌మెంట్‌కు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని అన్నారు.
అమరావతి, నవంబర్ 8: కర్నూలు నుంచి విశాఖపట్నంకు మూడు ఇందిరా బస్ సర్వీస్‌లను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైజాగ్ కు సూపర్ లగ్జరీ సర్వీస్ ఉండేదిని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టూరిజం డెవలప్ మెంట్ కు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని తెలిపారు. కర్నూలులో జరిగిన బస్ ప్రమాదంలో 19మంది మృతి చెందడం బాధాకరమన్నారు.
ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీ బస్సులో ఆటోమేటిక్ సిస్టమ్ ను తీసుకొని రావాలని అభిప్రాయపడ్డారు. బస్ లో తక్కువ ఖర్చుతో వచ్చే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవి కావని అన్నారు. ఇందుకు సంబంధించి దేశ ప్రధాని మోదీకి లెటర్ రాశానని చెప్పారు. త్వరలోనే ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీను కలిసి దీనిని అమలు చేసేలా ప్రయత్నం చేస్తానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేస్తామని చెప్పారు.
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డుపై ఉన్న బైక్‌ను వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలో సీటర్ వాహనాన్ని స్లీపర్‌గా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. ఏ-1 అయిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి తదనంతరం రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి:
తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...
ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్