Home » Police case
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావు భారీ అవినీతి, అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిబ్బంది, అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విచారణ చేపట్టారు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.
దేశంలో రోజు రోజుకు దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ ఖాతాదారుడు అంజిబాబు డబ్బులు డిపాజిట్ చేశాడు. అయితే డిపాజిట్ చేసిన డబ్బుల్లో దొంగనోట్లు జమ అయినట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. దీనిపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
విశాఖ జిల్లా: భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. రామారావు అనే వ్యక్తికి ఓ యువతి ఫోన్ చేసి శ్రీకాకుళం జిల్లా, సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని కోరింది. అతను ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే ముగ్గురు దుండగులు అతనిని కిడ్నాప్ చేసి.. అతని వద్ద ఉన్న డబ్బు, ఏటీఎం కార్డు తీసుకున్నారు.
పోలీసుల వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగా, శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బుగ్గిపాలైపోయాడు. అతను పులియాంతోపు తిరువికనగర్ 7వ వీధికి చెందిన రాజన్ (42)గా గుర్తించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అమాయకులను మోసం చేసి నకిలీ ఇన్సూరెన్సులు సేల్ చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని తయారు చేసి భారీ మోసాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కింద కేసులు నమోదు అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా, కేశవపట్టణం గ్రామం మొదటి నుంచి కలప స్మగ్లింగ్‌కు పేరుగాంచింది. ఈ గ్రామంలో చాలా మంది కలప స్మిగ్లింగ్ చేసి జీవనోపాధిని పొందుతారు. అయితే గ్రామంలో పెద్ద మొత్తంలో కలప నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారుల బృందాలు అక్కడకు వెళ్లాయి. ఇళ్లల్లో ఉన్న కలపను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.