Home » Perni Nani
గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
తన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారం లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామ య్య(నాని)పై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినాని వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం (జనవరి6) వరకు ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాఫీ కేసులో పేర్నినానిని పోలీసులు 6 వ నిందితుడిగా చేర్చారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు ఏ-6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను పోలీసులు అరెస్టు చేశారు.
మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని గోడౌన్ నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్ యజమాని జయసుధకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం నోటీసులు జారీచేశారు.
Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెకు ముందుస్తు బెయిలు మంజూరు చేస్తూ.. కృష్ణాజిల్లా కోర్టు సోమవారం ఆదేశించింది.
Perni Nani: గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో పేర్ని నాని ఫ్యామిలీకి వరుసగా గట్టి దెబ్బలు తగులుతోన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి పేర్ని ఫ్యామిలీ కోట్ల రూపాయిల్లో నగదు చెల్లించింది. అయితే గోడౌన్‌లో బియ్యం షార్టేజ్ మరింత పెరిగింది.
Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను.
Andhrapradesh: పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఇటీవల పోలీసులకు కోటి రెడ్డి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మానస తేజ, కోటి రెడ్డి అరెస్ట్‌లను పోలీసులు నేడు నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది.