Share News

Joint Collector : 1.67 కోట్లు చెల్లించండి!

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:57 AM

మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని గోడౌన్‌ నుంచి పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్‌ యజమాని జయసుధకు జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదివారం నోటీసులు జారీచేశారు.

 Joint Collector : 1.67 కోట్లు చెల్లించండి!

  • రేషన్‌ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధకు మళ్లీ నోటీసులు

  • రెండో విడత చెల్లింపునకు జేసీ ఆదేశం

మచిలీపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని గోడౌన్‌ నుంచి పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్‌ యజమాని జయసుధకు జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదివారం నోటీసులు జారీచేశారు. పౌరసరఫరా ల శాఖకు మరో రూ.1,67,22,893 చెల్లించాలని అందులో ఆదేశించారు. ఈ విషయాన్ని అధికారు లు గోప్యంగా ఉంచగా.. సోమవారం వెలుగు చూసింది. ఈ మొత్తాన్ని 3 రోజుల్లోపు చెల్లించాల ని అందులో పేర్కొన్నారు. పేర్ని జయసుధ పేరు తో ఉన్న గోడౌన్‌లో 3,78,866 కిలోల పీడీఎస్‌ బియ్యం మాయమైనట్లుగా అధికారులు మూడు విడతలుగా చేసిన పరిశీలన అనంతరం లెక్కచూపారు. కిలోకు రూ.44.58 ఖరీదుగా చూపి, మాయమైన బియ్యం మొత్తానికి పౌరసరఫరాల శాఖ ఎండీ సూచనల మేరకు రెట్టింపు మొత్తం లో రూ.3,37,79,693 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే రూ.1.70,56,800 చెల్లించారని, మిగిలిన రూ.1,67,22,893 చెల్లించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

ముందస్తు బెయిల్‌ మంజూరు: పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి సుజాత సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. జయసుధ తరఫున న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్‌ తరఫున లంకే వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. ప్ర తి నెలా జరగాల్సిన గోడౌన్ల తనిఖీ చేశా రా లేదా? అందుకు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయి? పౌరసరఫరాల శాఖ నుంచి ఎప్పుడెప్పుడు, ఎంతమేర బియ్యాన్ని పొట్లపాలెంలోని గోడౌన్‌కు ఇచ్చారు? ఆ రికార్డులను ఎందు కు సమర్పించలేదు? అని ప్రశ్నించారు. దీంతోపాటు గోడౌన్‌ యజమాని, మేనేజర్‌, పౌర సరఫరాల శాఖ అధికారుల సమక్షంలో స్టాక్‌ వివరాల ను తనిఖీ చేయాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించిన రికార్డులు ఎందుకు సమర్పించలేదని, గోడౌన్‌ యజమాని, మేనేజర్‌పైనే కేసు నమోదు చేశారని, పౌరసరఫరాల శాఖ అధికారులపై ఎం దుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు.

Updated Date - Dec 31 , 2024 | 04:57 AM