Home » Pawan Kalyan
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు.
త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. మంత్రివర్గ సమావేశానికి ముందు NDA నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, అటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలను, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం వర్చ్యువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది..
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఉప్పాడ సముద్ర రక్షణ గోడ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.