Share News

Pawan Kalyan: భలే ఈ సైకిల్‌.. భళా సిద్దూ

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:55 AM

తక్కువ ఖర్చుతో, బ్యాటరీతో నడిచే ఈ సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి..

Pawan Kalyan: భలే ఈ సైకిల్‌.. భళా సిద్దూ

  • ఇంటర్‌ విద్యార్థికి పవన్‌ అభినందనలు

  • ప్రోత్సాహకం కింద రూ.లక్ష అందజేత

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతో, బ్యాటరీతో నడిచే ఈ-సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి రాజాపు సిద్దూను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందనలతో ముంచెత్తారు. వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్దూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్‌, అతడిని మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్ధూ తయారు చేసిన ఈ-సైకిల్‌ మూడు గంటలు చార్జింగ్‌ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. సిద్దూ తయారుచేసిన సైకిల్‌ను పవన్‌ కల్యాణ్‌ స్వయంగా నడిపారు. అతడి ఆలోచనలకు అబ్బురపడ్డారు. సిద్దూ రూపొందించిన ‘గ్రాసరీ గురూ వాట్సాప్‌ సర్వీస్‌’ బ్రోచర్‌ను కూడా చూసి ప్రత్యేకంగా అభినందించారు. వినూత్న ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ సిద్దూకు రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్‌పై సిద్దూను కూర్చోబెట్టుకొని పవన్‌ స్వయంగా నడిపారు.

Updated Date - Jul 10 , 2025 | 04:55 AM