Home » Pattabhi ram
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేందుకు పది రోజులు పడుతుందంటూ సర్కార్ చెప్పడంపై టీడీపీ నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే జగన్మోహన రెడ్డి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. సోమవారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కన్నా ముందే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలనే ఆదేశాలు వచ్చాయని గుర్తుచేశారు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్‌లు ఎక్కడా డోర్ టూ డోర్ పెన్షన్‌లు డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని చెప్పలేదన్నారు.
సీఎం జగన్(CM Jagan) సింగిల్ కాదని.. ఆయన వెంట మాఫియా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి(Pattabhi) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ నేతలపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ సీతారామాంజనేయులు నిఘా పెట్టే బదులు.. విశాఖలో డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశంపై ఆయన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్టణం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏంపని అని ప్రశ్నించారు. జగన్ మోచేతినీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందన్నారు. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లల్లో లక్షాలాది కోట్లు దోచుకున్న జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డిపట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం (Jagan Govt) రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్‌ను ఇవ్వలేదా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram) ప్రశ్నించారు. తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును జగన్ ఈ సంస్థకు దారాదత్తం చేయలేదా అని నిలదీశారు.
అమరావతి: రాజధానిలో పూర్తికాని నిర్మాణాలు పూర్తి అయినట్టు, వాటిలో అధికారులు నివాసముంటున్నట్టు, బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం10.. ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు
సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి.. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యాదీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. పట్టభద్రుల నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని ఆరోపించారు.