Home » Pahalgam Terror Attack
జార్ఖాండ్‌లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.
సహజంగానే ఇలాంటి పరిస్థితుల్లో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని పాక్ అనుకుంటుందని, అయితే సభ్యుదేశాలు పాక్‌ను కఠిన ప్రశ్నలు వేస్తాయని, ముఖ్యంగా పహల్గాం ఘటనను తామే బాధ్యులమని తొలుత లష్కరే తొయిబా ప్రకటించడం గురించి నిలదీయాలని మన అంచనాగా ఉంటుందని శశిథరూర్ అన్నారు.
ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది.
రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అసీం మునీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రాంతీయ శాంతినే కోరుకుంటోందని, అయితే తనను తాను రక్షించుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడదని అన్నారు.
సైనిక పరిష్కారం పరిష్కారం కాదు అని పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ జాతీయ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్ష నేత, పీటీఐ మద్దతుతో గెలిచిన ఎంపీ ఒమర్ అయూబ్ భారత్‌పై విషం కక్కారు. యుద్ధోన్మాదంతో ఊగిపోతూ వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన సాగింది. అనంతరం బీజేపీ నేతలు డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు.
ప్రధాని మోదీతో ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంలో ప్రధాని మాటలతో పూర్తిగా ఏకీభవించిన పుతిన్, ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు అన్నివిధాల సహాయకారిగా
పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం గత శనివారం నుంచి ఇది రెండోసారి. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన 'అబ్దాలీ వెపన్ సిస్టమ్' అనే బాలిస్టిక్ క్షిపణిని శనివారంనాడు పరీక్షించింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
Pakistan Army: ఇండియన్ ఆర్మీ పాక్ ఆర్మీకి తగిన విధంగా సమాధానం చెబుతూనే ఉంది. సరిహద్దుల వెంబడి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులోని పోస్టులను టార్గెట్‌గా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది.