Home » Ongole
రాబోయే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని.. ఇవే చివరి ఎన్నికలు అని తెలిపారు.
Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఏ క్షణాన అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నియోజకవర్గాల ఇంచార్జులను మార్చడం మొదలుపెట్టారో అప్పట్నుంచే.. అధికార పార్టీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటి వరకూ రెండు జాబితాలను రిలీజ్ చేయడంతో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కడుతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం..
Andhrapradesh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అసమ్మతి సెగ తగిలింది. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్‌ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్‌కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా..
ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు.
మెడికల్ విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. క్లాస్ రూమ్‌లోనే రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత రోడ్డుపైనా దాడులకు దిగారు. రక్తం కారేలా కొట్టుకున్నారు.
ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్లాసు రూములోనే తోటి విద్యార్థులపై గంజాయి బ్యాచ్ ఒకటి దాడులకు పాల్పడింది.గంజాయి సేవిస్తున్నారన్న ఫిర్యాదుతో నాలుగు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ బయటకు పంపించడం జరిగింది.
ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు.