Home » Odisha
ఈ అద్దం ప్రజలను నగ్నంగా చూపిస్తుందని నమ్మించి, వృద్దుడి వద్ద నుంచి రూ.9లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోణార్క్ వీల్‌ను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించిన మిషెలిన్ స్టార్డ్ చెఫ్, ఎంటర్‌ప్రైజింగ్ ఎంటర్‌ప్రెన్యూవర్ వికాస్ ఖన్నాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఒడిశాకు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో కోణార్క్ చక్రం ఒకటి అనే విషయం తెలిసిందే.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నది ఒడ్డున కూర్చొని దుస్తులు ఉతుకుతున్న ఓ మహిళను మొసలి నీటిలోకి లాక్కెళ్లి చంపేసింది.
తన మరిదితో ప్రేమలో పడిన ఓ మహిళ తన భర్త సమక్షంలోనే అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్తే దగ్గరుండి మరీ తన భార్యకు, ఆమె మరిదికి వివాహం జరిపించాడు. ఒడిశాలోని సోన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును ఆయన వెనక్కి నెట్టారు. ఈ జాబితాలో తొలి స్థానంలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి నవీన్ పట్నాయక్ మరోసారి సీఎం అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.
కొందరు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు అదే వీడియోలు చూస్తూ వివిధ నేరాలకు పాల్పడుతూ చివరకు జైలుపాలవుతున్నారు. ఇంకొందరు ఇదే వీడియోల సాయంతో వినూత్న ఆవిష్కరణలు చేసి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం..ఇప్పుడు ఇది చాలారంగాల్లో వాడుకలో ఉంది. ఈ టెక్నాలజీ రూపకల్పనలో వార్తలు చదివే న్యూస్ యాంకర్ల ను కూడా తీసుకొచ్చింది. ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ వచ్చేశారు. తాజాగా ఒడిశాలో ఓ న్యూస్ ఛానెల్.. AI ప్రెజెంటర్‌ను పరిచయం చేసింది. ఒడిశాకు చెందిన ఓ ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన మొదటి వర్చువల్ న్యూస్ ప్రజెంటర్‌ను భువనేశ్వర్‌లో ప్రారంభించింది.
దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి నెలకు పైగా అవుతున్నా ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి చాలా మంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తప్పుడు సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ అధికారులు.. ఇటీవల..
ఒడిషాలో వైద్యులు హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్స చేస్తున్న ఘటన ఆసక్తికరంగా మారింది. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండాముండా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి భవనం స్లాబ్ కొంత భాగం కూలిపోవడంతో దండాముండా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, ఇతర సిబ్బంది హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు.
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడులో ఉద్యోగం (Job) చేస్తుంటాడు.