Share News

ED: ఘరానా మోసం.. ఈడీ అడిషనల్ డైరెక్టర్లమంటూ 300 ఉద్యోగులకు టోకరా

ABN , Publish Date - Mar 17 , 2024 | 09:14 PM

ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది.

ED: ఘరానా మోసం.. ఈడీ అడిషనల్ డైరెక్టర్లమంటూ 300 ఉద్యోగులకు టోకరా

భువనేశ్వర్: ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి.

నిందితులు భారీ మొత్తంలో అప్పులు తీసుకుని తిరిగి కట్టలేదని తెలుస్తోంది. దానికితోడు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసేందుకు వీరిద్దరూ పథకం పన్నారని పోలీసులు చెబుతున్నారు. ఈడీ అదనపు డైరెక్టర్లమంటూ ఇరువురు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను సంప్రదించారు. వారికి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. అలా ఉద్యోగుల నుంచి రూ.16 లక్షలకుపైగా కొట్టేశారు. తాము మోసపోయామని గుర్తించిన ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఛత్రపూర్ సబ్ కలెక్టర్ దేబదత్తా మొహంతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. వారి నుంచి ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఐదు మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్కులు, నకిలీ ఐడీ కార్డులు, 17 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 17 , 2024 | 09:23 PM