Home » NRI
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా 43వ వార్షిక ఇండియా-డే పరేడ్‌ను కన్నులపండువగా నిర్వహించింది.
ఏడడుగుల బంధం ఎడారి దేశాలకు వచ్చేసరికి ఎండమావులవుతుంది. సంపాదన కోసం ఎడారి దేశాలకు వచ్చిన తర్వాత స్వంత వారే పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్‌లో ఇద్దరు ప్రవాసాంధ్ర మహిళలకు ఎదురైన పరిస్థితి గురించి తెలుసుకుంటే హృదయం భారం అవక మానదు.
యూఎస్‌లోని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సేవా రంగంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా అమెరికాలోని వివిధ నగరాలలో ఆప్త, అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు.
మినియాపోలిస్ ఇండియా ఫెస్ట్‌లో భాగంగా 79వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాల సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీం పాల్గొని తానా పాఠశాల సభ్యత్వం నమోదు విశిష్టత తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు.
అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వైభవంగా జరిగింది.
పిచ్చి పలురకాలు... వెర్రి వేయి రకాలు..’ అని వూరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివేంజ్ తీర్చుకున్నట్లు పొలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్లిన దేశానికే మళ్లీ మళ్లీ వెళుతున్నారు.
సింగపూర్‌లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ప్రవచనామృతం ఆకట్టుకుంది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సౌదీ అరేబియా రాజధానికి కరీంనగర్ బిర్యానీ ఘుమఘుమలు పాకాయి. రియాద్‌లో హైదరాబాదీ హోటళ్లలో తలమానికంగా భావించే పీకాక్ రెస్టరెంట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రవాస భారతీయులకు మాతృభూమి రుచులను అందించేందుకు సిద్ధమవుతోంది.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.