Home » Nitish Kumar
బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్‌బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఇండియా కూటమి(INDIA Alliance) నుంచి వైదొలుగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్ర్కమించడానికి బలమైన కారణం ఉందని జనతాదళ్(యునైటెడ్)(JDU) చెబుతోంది.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిహార్ రాజకీయాలను పక్కన పెట్టేస్తే.. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఒక విషయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇప్పటికే 8సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. ఇప్పుడు 9వ సారి సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు.
బిహార్(Bihar) సీఎం పదవికి రాజీనామా(Nitish Kumar Resign) చేసిన అనంతరం నితీశ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD)తో రెండేళ్ల అనుబంధానికి జనతాదళ్ (యునైటెడ్) ముగింపు పలికి సీఎం నితీష్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) తో పొత్తు పెట్టుకుని మళ్లీ సీఎంగా ఇదే రోజు సాయంత్రం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నితీష్ కుమార్ రాజీనామాతోనూ, బీజేపీతో చెలిమికట్టి తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతోనూ తెరపడకపోవచ్చని తెలుస్తోంది. తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్న ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్... నితీష్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బలమైన వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.