Share News

Nitish Kumar: నితీశ్ కుమార్ సరికొత్త రికార్డ్.. సరిలేరు మీకెవ్వరు!

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:28 PM

బిహార్ రాజకీయాలను పక్కన పెట్టేస్తే.. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఒక విషయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇప్పటికే 8సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. ఇప్పుడు 9వ సారి సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు.

Nitish Kumar: నితీశ్ కుమార్ సరికొత్త రికార్డ్.. సరిలేరు మీకెవ్వరు!

బిహార్ రాజకీయాలను పక్కన పెట్టేస్తే.. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఒక విషయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇప్పటికే 8సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. ఇప్పుడు 9వ సారి సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. మన దేశంలోనే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. నితీష్ తొలిసారిగా 2000 ఏడాదిలో 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పటి నుంచి మొదలుకొని, ఇప్పుడు తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. విశేషం ఏమిటంటే.. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రులుగా చెలామణి అయిన వారు కూడా ఈ విషయంలో వెనుకబడిపోయారు.


పదండి.. ఎవరెవరు ఎన్నిసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారో తెలుసుకుందాం!

  • హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వీరభద్ర సింగ్ ఆరు సార్లు ప్రమాణం చేశారు. 1983లో తొలిసారి సీఎం అయిన ఆయన.. 1985, 1993, 1998, 2003, 2012లో సీఎం బాధ్యతల్ని నిర్వర్తించారు.

  • తమిళనాడు దివంగత నేత జయలలిత కూడా 6 సార్లు సీఎం అయ్యారు. 1991లో తొలిసారి సీఎం అయిన ఆమె.. 2001, 2002, 2011, 2015, 2016లో తమిళనాడు సీఎంగా వ్యవహరించారు.

  • సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ వరుసగా 5 సార్లు సీఎంగా కొనసాగారు. 1994లో తొలిసారి సీఎం కాగా.. 1999, 2004, 2009, 2014 వరకు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు.

  • పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు.. 1977 నుండి 2000 వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. ఆయన కేవలం ఐదుసార్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.

  • అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ 5 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు. 1980లో తొలిసారి సీఎం అయిన ఆయన.. 1985, 1990, 1995, 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

  • ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తొలిసారి 2000లో సీఎం అయిన ఆయన.. అప్పటి నుంచి సీఎంగా కొనసాగుతూనే ఉన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 03:57 PM