Home » Nimmala Rama Naidu
పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు ఏనాడో చెప్పిన నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల సమర్థ నాయకత్వంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
Minister Nimmala Ramanaidu: ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ బుద్ధి ఇంకా మారలేదని నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతి, గుండాయిజం అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని విమర్శించారు.
‘వంశీలాంటి వ్యవస్థీకృత నేరగాడిని సమర్థిస్తూ జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది.
Nimmala Ramanaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కూటమి నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు.
Nimmala RamaNaidu: వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నాటి సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయాడు మండిపడ్డారు. నాడు జగన్ చేసిన పాపం... నేడు రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు.
ఇంజనీరింగ్ అధికారుల మధ్య వివాదాలు తలెత్తి న్యాయపోరాటాలు చేస్తున్న తరుణంలో, వారి మధ్య సఖ్యతను పెంచేలా మంత్రి నిమ్మల రామానాయుడు చొరవ చూపడంతో సమస్యకు పరిష్కారం.
Kolusu Parthasarathy: పోలవరం ప్రాజెక్టును జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు.
Nimmala Ramanaidu: పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి 2025 జులైకు ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వనున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. రూ.1050 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు అన్ని అనుమతులు ఇప్పించారన్నారు. బాటిల్ నెక్‌పై సమీక్ష చేసి పురుషోత్తం పట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామని.. దీని పై అధికారులతో సమీక్ష చేసి పలు సూచనలు చేశామన్నారు.