Share News

గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు: నిమ్మల

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:52 AM

2027లో రానున్న గోదావరి పుష్కరాలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు: నిమ్మల

Nimmala Ramanaidu: 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాగా పనులు శాశ్వత ప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (రాజమండ్రి అర్బన్‌) కోరారు. పుష్కర ఘాట్ల వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేయాలని బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేపల్లిగూడెం) కోరారు.

ఐదేళ్లలో గేట్లకు గ్రీజయినా పెట్టలేదు

వైసీపీ ప్రభుత్వం సాగునీటి, మురుగునీటి కాలువల నిర్వహణను అధ్వానం చేసిందని మంత్రి నిమ్మల అన్నారు. లాకుల్లోని గేట్లకు ఐదేళ్లలో కనీసం గ్రీజు కూడా పెట్టలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూడిక, తామర కాడ తొలగించాల్సిన పనులు 4,971 ఉన్నాయని, గోదావరి డెల్టాలోనే ఇందుకోసం రూ.129 కోట్లు అవసరమని చెప్పారు. కొందరు కాంట్రాక్టర్లు టెండర్లలో కావాలనే 40 నుంచి 50 శాతం తక్కువకు కోట్‌ చేశారని, ఇది పనులు చేయకుండా ఉండే ఎత్తుగడలా కనిపిస్తోందన్నారు. కాలువల నిర్వహణపై సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం) అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

Updated Date - Mar 04 , 2025 | 06:52 AM